నమస్కారం! మీ కోసం మా సంస్థ పరిశోధన బృందం "ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP)" కోర్సు ను రూపొందించడం జరిగింది. ఈ కోర్సు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజయవంతమైన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది. అలాగే లోన్ పొందడానికి అర్హతలు, రుణ ప్రక్రియ మరియు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన దశలతో పాటుగా PMEGP పథకంలోని వివిధ అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది.
ఈ PMEGP scheme in Telugu కోర్సు ద్వారా, PMEGP పథకం, దాని లక్ష్యాలు మరియు వ్యవస్థాపకులకు అందించే ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అలాగే PMEGP స్కీమ్ ద్వారా లోన్ పొందడానికి వయస్సు, విద్యార్హత, ప్రాజెక్ట్ సాధ్యత మరియు అర్హత ప్రమాణాలు గురించి మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్సులో PMEGP loan process లో భాగంగా రుణ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు,లోన్ మొత్తం, వడ్డీ రేట్లు మరియు తిరిగి చెల్లించే కాల వ్యవధి గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా మార్కెట్ పరిశోధన, ఆర్థిక అంచనాలు, ఉత్పత్తి మరియు సేవ వివరణ వంటి విషయాలతో పాటుగా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఎలా సిద్ధం చేయాలో మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్సు ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ కార్యకలాపాలు మరియు చట్టపరమైన సమ్మతితో పాటుగా వ్యాపార నిర్వహణ యొక్క ప్రాథమిక అంశాలను కూడా కవర్ చేస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించాలి, స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యాపారంగా ఎలా సృష్టించాలో నేర్చుకుంటారు.
ఈ కోర్సును చూడటం వలన, మీరు విజయవంతమైన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. అలాగే PMEGP loan కోసం దరఖాస్తు చేయడానికి, ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయడానికి సమగ్రమైన జ్ఞానాన్ని పొందుతారు.
మీ విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంచడానికి వున్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే పూర్తి కోర్సును చూసి PMEGP స్కీమ్ ద్వారా లోన్ ఎలా పొందాలో తెలుసుకొని, మీ విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
1Hrs 16Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate