కడక్‌నాథ్ కోళ్లను కడక్ నాథ్ ముర్గా, కాళి మాసి లేదా బ్లాక్ మీట్ చికెన్ అని కూడా పిలుస్తారు. ఈ కడక్ నాథ్ కోళ్లు భారతదేశానికి చెందిన పౌల్ట్రీ జాతి. ప్రత్యేక రుచి, అధిక పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలకు కడక్‌నాథ్ కోళ్లు ప్రసిద్ధి చెందాయి. మీరు కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫారమ్‌ను ప్రారంభించాలనుకుంటే లేదా కడక్‌నాథ్ కోళ్ల పెంపకం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే “ కడక్‌నాథ్ కోళ్ల పెంపకం కోర్సు “ అనే కోర్సు మీకు చాలా ఉపయోగపడుతుంది.
ఈ కోర్సులో మీరు కడక్‌నాథ్ కోళ్ల పెంపకం, సరైన కోడి జాతిని ఎంచుకోవడం, షెడ్ నిర్వహణ మరియు లాభాలను పెంచుకోవడం తదితర విషయాలన్నీ ఉంటాయి. మీరు కడక్‌నాథ్ ముర్గా యొక్క ప్రత్యేక లక్షణాల గురించి మరియు గరిష్ట దిగుబడి కోసం ఈ పక్షులను ఎలా పెంచాలన్న విషయం గురించి, గుడ్లను పొదుగడం మరియు పెంచడం గురించి నేర్చుకుంటారు. మీరు మీ కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి అవసరమైన పోషకాహారం, వ్యాధుల నివారణ మరియు మార్కెటింగ్ వ్యూహాల గురించి కూడా నేర్చుకుంటారు.
కర్నాటకకు చెందిన విజయ్ కుమార్ చాల ఏళ్ల నుంచి కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్నారు. అంతేకాకుండా ఆయన మిగిలిన పౌల్ట్రీ ఆదాయంతో పోలిస్తే ఈ కడక్‌నాథ్ కోళ్ల పెంపకంతో అధిక లాభాలు అందుకోవచ్చని చెబుతున్నారు. కడక్‌నాథ్ కోళ్ల పెంపకం పై తనకు ఉన్న అభిరుచిని వ్యాపార అవకాశంగా మార్చుకుని విజయం సాధించడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని పొందారు.
ఈ కోర్సు సహాయంతో, మీరు కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి సంబంధించిన ఉత్తమ పద్దతుల గురించి విలువైన ఉదాహరణలను పొందుతారు. అలాగే కడక్ నాథ్ కోళ్ల పెంపకానికి సరైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి? మౌలిక సదుపాయాలను రూపొందించడం మరియు షెడ్ నిర్మించడం మరియు కోళ్ల ఫారం యొక్క రోజువారీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి? వంటి విషయాలన్నింటి పై ఈ కోర్సు అవగాహన కల్పిస్తుంది. ఈ కోర్సు ముగిసే సమయానికి మీరు కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫారమ్‌ను ప్రారంభించి, నిర్వహించగలుగుతారు. అలాగే అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సులో జాయిన్ అయ్యి , అన్ని విషయాలను తెలుసుకొని అధిక లాభాలను పొందండి.
ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మొత్తం కోర్సు పొడవు
2Hrs 50Min
మీరు ఏమి నేర్చుకున్నారు
Completion Certificate